-
జిమ్మకొక రుచి పుర్రెకొక గుణం – Telugu samethalu Telangana – 8

షిక ఉన్న అమ్మ ఎటు పెట్టిన సక్కగెనట. ఎంత చెట్టుకు అంతే గాలి ఎంత పిండికి అంతే రొట్టె. జిమ్మకొక రుచి పుర్రెకొక గుణం. గాడిదకు ఏమి తెలుసు గర్క పూస. కోతిమొకపోడు కొంపకు సేటు.
-
ఊరంత ఊమ్శిన నేను పోయి చెరువల ఊమ్స్తా అన్నాడట – Telugu Samethalu – Telangana

లక్కొసన్తి తల్లికి రాయి అసొన్తి పిల్లలట ఊరంత ఊమ్శిన నేను పోయి చెరువల ఊమ్స్తా అన్నాడట సాగినోడు పెళ్ళాం సాకలోని వెంట పోయిన నయమే తోటోడు తొడ కోసుకున్నడని నేను మెడ కోసుకుంటాన సోకుల పిత్తు గోడకు వేసి ఒత్తు సిగ్గు తప్పిన అత్తకు మొరుదొప్పు అల్లుడు
-
సత్తె పూసకు సుత్తె కామ – Telugu samethalu Telangana

అన్ని సత్యం ఇల్లు గుత్యం. గుడ్డు అచ్చి పిల్లని ఎక్కిరించిందట. ఊరోళ్ళని చూసి ఉప్పునీళ్ళు తాగిందట మందిని చూసి మంచి నీళ్ళు తాగిందట. పెట్టేటోడు ఉంటే సచ్చేటోడు లేశివస్తాడు. సత్తె పూసకు సుత్తె కామ
-
అవసరం ఉంటే అక్క సోపతి లేక పోతే కుక్క సోపతి – Telugu samethalu Telangana

అవసరం ఉంటే అక్క సోపతి లేక పోతే కుక్క సోపతి. సోద్యాల సక్కుబాయికి మూడుతులాల ముక్కుపోగూ. ఏనుగు పోంగ ఎన్ని కుక్కలు మొరగవు. పెండమీద రౌతు ఏస్తె మొఖం మీద చిల్లుతుంది. సచ్చినోడి పెళ్ళికి అచ్చిందె కట్నం అన్నటు.
-
మొద్దుమొకానికి కుడుకల దుకాణము -Telugu samethalu Telangana

మొద్దుమొకానికి కుడుకల దుకాణము. గతి లేని సంసారము చేయొచ్చు గాని సుతి లేని సంసారము చేయరాదు. మీసము లేకున్న రోశము ఎక్కువ వీనికి. చదువు చారెడు బలపాలు దోసెడు. ముసలిత్తు ఎసరు పెడితే బుసబుస పొంగిదట.
-
పుంటి కూర పుల్లగ అల్లుడు అచ్చె మెల్లగ – Telugu samethalu Telangana

పుంటి కూర పుల్లగ అల్లుడు అచ్చె మెల్లగ. మొరటోడికి ఏమి తెలుసు మల్లెమొగ్గ వాసన. పొమ్మనక పొగపెట్టే. పాతదానికి పూతపెట్టే. మందిది మంగళవారం మనది సొమవారం.
-
Telugu samethalu – Telangana – part one

భయం లేనీ కోడి బజారు లో గుడ్డూ పెట్టిందట. ఇసంత రమ్మంటే ఇల్లంత నాదే అన్నాడట. పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టే. వెనుక నుంచి ఏనుగు పోయిన గాని ముందు నుంచి పిల్లి పోవద్దట. అన్నీ ఉన్నా కాని అల్లుడు నోట్లో శని అన్నట్టు