మలినం లేని మట్టే మన చివరి బంధం – Mother Soil – Rushisbiz.com

mother land poem

ఎందుకంటే ????

మట్టిలో పుట్టినదాన్ని తింటాం!

అదే మట్టి మనకి అంటితే అస్యహించుకుంటాం, అయిన మట్టి బాధపడదు!

కాని మనం బ్రతికిన చివరి రోజు అదే మట్టిని కౌగిలించుకుంటాం! అయిన ఆ మట్టి భారం అనుకోదు!

మట్టికి మంచోడు, చెడ్దోడు, ఉన్నోడు, లేనోడు, గొప్పోడు, పేదోడు ఇవేమీ తెలియదు!

పేరుకు మట్టే కాని మలినం ఉండదు, మర్మం తెలియదు!

అందుకే మన చివరి బంధం అయిన, బంధువు అయిన ఆ మట్టే!

తల్లితండ్రులు మట్టిలాంటి వాళ్ళు,

ముడతలు పడిన ముసలి వయస్సని నువ్వు అస్యహించుకున్నా

వాళ్ళకి కలిగే బాధ, బిడ్డల మీద ఉండే ప్రేమ ముందు చాల చిన్నదిగా కనిపిస్తుంది,

కష్టం వచ్చిందని నువ్వు కన్నీళ్ళతో కన్నవారి కౌగిలి చేరినప్పుడు,

నీ బ్రతుకు బాగు కోసం, మన మొదటి బంధం అయిన వారు,

మనిషి చివరి బంధమయిన మట్టిలో కలసిపోడానికి క్షణం కూడా ఆలోచించరు!

 Written By
suresh rushisbiz.com

 

(Visited 86 times, 1 visits today)
,

error: