“ఒక అబద్దం ఆడితే వంద అబద్దాల్లు ఆడాలి అప్పుడు మన జీవితమే అబద్దం అవుతుంది. నిజంతోనే నిజమయిన జీవితం నిజమయిన మన్నాశాంతి.”
“ఈ జీవితం ఎవరిని వదిలి పెట్టదు అందరి దూల తీర్చెస్తది, అయిన సరే తిరిగి అదే జీవితాన్ని దూల తీర్చేయాలి.”
“మనుషుల జీవితాల్లు మార్చడం చాలా సులభం, కానీ మనుషుల మనసులు మార్చడం అంత సులభం కాదు.”
“ప్రేమ, బందం, భాద్యత, సేవ, లక్ష్యం ఏదయినా కావొచ్చు, ఇవ్వన్నీ నిలబడాలి అంటే తపన ఉండాలి. అందుకే తపన ఇవ్వనిటికీ కంటే చాలా గొప్పది.”
“ఒక్కొక్కసారి ఒక పిచ్చోడికి ఒక జ్ఞానికి పెద్ద తేడా ఏమీ ఉండదు.”
“ఏదో ఒక రోజు మన జీవితం మనకు నచ్చినట్టు మారుతుంది, జరుగుతుంది.”
“కేవలం కండ బలం ఉంటే చాలు ఒక మనిషిని కొట్టొచ్చు, కాస్త బుద్ధి బలం ఉంటే చాలు ఒక సమస్యని పరిష్కరించొచ్చు, కానీ కొండంత గుండె బలం ఉంటే తప్ప కొన్ని నిజాలన్ని మాట్లాడలేము ఎదుర్కోలేము.”
” నుదుటి పై ముద్దు పెడితే నిజమైన ప్రేమ, పెదాలపై ముద్దు పెడితే కాదనలేని కామం “

Comments

comments