ఆకలి అనగానే తన ఆకలి మాని నాకు అక్షయ పాత్ర అయింది! – Telugu Poetry On Mother-2 by Suri

mother love poetry

జీవితం అంటే జీతం కాదు,

మన గతం భావితరాలకు గమ్యంగా ఉండాలని

బ్రతుకు విలువను నేర్పిన ఓ అమ్మ !

కడుపులో ఉండగానే కమ్మని ప్రేమని పంచింది!

పుట్టాక నా బోసినవ్వుల కోసం తను ఆడుకునే బొమ్మ అయింది!

ఆకలి అనగానే తన ఆకలి మాని నాకు అక్షయ పాత్ర అయింది!

ఎదుగుతున్న నా కోసం ఏరులా స్వేదం చిందించింది!

యదలోని వ్యధను కంటిలోనే దాచుకొని కరుణ చూపించింది!

ఎదిగిన నన్ను చూసి ఎత్తుపల్లాల నడకను మరువొద్దంది!

ఎవరమ్మా అంటే నా బిడ్డ అంటూ పాలుగారే పసిబుగ్గల బోసినవ్వులు నవ్వుతుంది!

తల్లి! ఓ మమతా మూర్తి! నీ కంటే గొప్పవాళ్ళెవరు!

సృష్టిలో ఈ రోజు నాకూ చోటిచ్చిన నీకు, ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను!

మళ్ళీ నీ వెచ్చని వడిలో తలదాచుకోడం తప్ప!

 Written By
suresh rushisbiz.com

 

 

(Visited 97 times, 1 visits today)

error: