దూరం చేస్తే కాని దరికి చేరదు – అనుభవిస్తే కాని అర్థం కాదు – Telugu Love Poetry – 19

telugu love poetry

కాలమైతే కాని వాన పడదు

కష్టపడితే కాని ఫలితం ఉండదు

అనుభవిస్తే కాని అర్థం కాదు

దూరం చేస్తే కాని దరికి చేరదు

కఠినమైతే కాని బుద్ధి పోదు

కనుమరుగైతే కాని కరుణ రాదు

పరీక్షిస్తే కాని పరిష్కారం కాదు

సమయమొస్తే కాని విలువ తెలియదు

విలువలు లేని ఓ వెర్రి దాన

విలువే లేని ఓ మూగ దాన

గ్రహించక పోతే తప్పదు నీకు మూల్యం

ఆవేశం వేల విర్రవీగిన నీ అహం

పనికి రాక పోయే నీకు తోడుగా, నీడగా

తప్పుతో తప్పించుకోలేవు

అబ్బద్ధాలతో నటించలేవు

నిజం తోనే నీకు నిజమైన జీవితం

నిజాయితి తోనే నీకు నిజమైన శాంతి, మనశ్శాంతి

మీ ఋషి గారు

(Visited 99 times, 1 visits today)

error: