పోరిలతో ప్రేమ పోరు వద్దురా – బీర్లతో బ్రతుకు బేరము బెటరురా – Telugu Love Poetry – 17


పోరిలతో ప్రేమ పోరు వద్దురా

బీర్లతో బ్రతుకు బేరము బెటరురా

మద్యం మత్తు ఒక్క రోజేరా లేకుంటే ఉన్నంత సేపేరా

ముద్దుల వ్యసనం నిరంతరం మోసమేరా

బాధలో నీకు ఇది ఓదార్పురా తోడురా

బంధములో అది నీకు చేదార్పురా

చేదుగా ఉండొచ్చు ఇది కాని చెడు కొంచెమేరా

తీయగా ఉండొచ్చు కాని అది జీవితాంతమురా

వింటుందిరా ఇది నీ వ్యధ ఏదైనా కసురుకోకుండా

సోధి అంటుందిరా అది నీ బాధ ఏదైనా వినకుండ

ఖరీదు చేసిన కమ్మనిదిరా ఈ బీరు

ఖర్చులు చేసిన ఖబర్దార్ అంటుందిరా ఆ పోరు

కొత్త మిత్రులు కొలువుదీరుతారు రా నీకు ఇక్కడ

పగలతో పట్టింపులతో శత్రువులవుతారు రా నీకు అక్కడ

అవసరమున్న లేక పోయిన నీకు ఇది చేదోడు వాదోడు

అవసరం తీరాక అది కాదురా నీ చెలికత్తె

నచ్చినప్పుడే వెళ్ళొచ్చురా మద్యపానశాల

నచ్చిన నచ్చకపోయిన నొచ్చుకొని పోవాలిరా ఆ రాక్షస మేళ

తాగుతేనే నీవు ఇక్కడ తాగుబోతువు రా

తాగకున్న నీవు అక్కడ తిరుగుబోతువు రా

ఊగుతావు, పడతావు, మళ్లీ లేస్తావు ఇక్కడ

ఊగిపోతావు, ఊభిలో పడతావు, ఒడ్డుకు చేరలేవు అక్కడ

మనసు చంపుకొని నటించకు రా ఈ బానిస బ్రతుకు

కంపల సోపతి మనకు వద్దురా బ్రదరు

అర్థం కాక పోతే మనము కాలేమురా మగ మహారాజులం

తెలిసి తెలిసి చేసుకోకురా నీ బ్రతుకు బీడి బిచ్చం

Video

(Visited 70 times, 1 visits today)
error: