కాలమైతే కాని వాన పడదు
కష్టపడితే కాని ఫలితం ఉండదు
అనుభవిస్తే కాని అర్థం కాదు
దూరం చేస్తే కాని దరికి చేరదు
కఠినమైతే కాని బుద్ధి పోదు
కనుమరుగైతే కాని కరుణ రాదు
పరీక్షిస్తే కాని పరిష్కారం కాదు
సమయమొస్తే కాని విలువ తెలియదు
విలువలు లేని ఓ వెర్రి దాన
విలువే లేని ఓ మూగ దాన
గ్రహించక పోతే తప్పదు నీకు మూల్యం
ఆవేశం వేల విర్రవీగిన నీ అహం
పనికి రాక పోయే నీకు తోడుగా, నీడగా
తప్పుతో తప్పించుకోలేవు
అబ్బద్ధాలతో నటించలేవు
నిజం తోనే నీకు నిజమైన జీవితం
నిజాయితి తోనే నీకు నిజమైన శాంతి, మనశ్శాంతి
మీ ఋషి గారు
(Visited 90 times, 1 visits today)