విసిరేసిన విస్తరి నువ్వే ! విజేత నువ్వే ! – Telugu Poetry On Mother by Suri

Mothers-Love - telugu poetry

ఆకలి ఉంది కాని అమ్మ లేదు!

నడవాలని ఉంది కాని నాన్న లేడు!

ఏడుపు ఉంది కాని కన్నీళ్ళు లేవు!

కోపం ఉంది కాని ద్వేషం లేదు!

చిరు నవ్వు ఉంది కాని సంతోషం లేదు!

ఆయుష్షు ఉంది కాని ప్రాణం లేదు!

కౌగిలిలో వదగాల్సిన నన్ను కాలువకి వదిలేసావు!

ముద్దులలో ముంచాల్సిన నన్ను మురికి నేలకి అందించావు!

నా ఆటైన, ఆకలైనా ఆ మురికి నేలే తీర్చింది!

పాటైన, పాఠమైన ఆ నేలే నేర్పింది!

ఎన్నో ఎదురుచూపులు , ఎన్నో ఎదురీతలు ,

ఏ దారిన వెళుతున్నానో తెలియదు , ఏ దరికి చేరుతానో తెలియదు!

“నీ దరి కలగా వచ్చిన చాలని కనులు మూసుకున్నాను,

కలై కనిపించి లాలించి, మురిపించి, ప్రేమించి, పాలించి

‘నువ్వు ఒక్కడిగా ఉండు కాని ఒంటరి మాత్రం కాదు’ అని దీవించి,

మరిపించి మాయమైపోయిన మాతృమూర్తి ,

నీ దివ్వ్యమైన నా కల నేడు నిజమై

‘విజేతగా నన్ను ఒక్కడినే నిలిపి అందరి వాణ్ణి చేసావు’

అయిన నిన్ను చూడాలనే ఆశ, చూసాకే నా చివరి శ్వాస!!!!”

Written By
suresh rushisbiz.com

 

 

(Visited 118 times, 1 visits today)
,

error: